గొప్ప రాజకీయ నాయకుడిని అని చెప్పుకోవడానికి రాజకీయాల్లో ఉన్న అందరూ తాపత్రయపడుతూ ఉంటారు. చంద్రబాబులాంటి వాళ్ళు అయితే నేను గొప్పవాడిని అని వాళ్ళ భజన వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. అయితే ఆచరణలోకి వచ్చేసరికి విలువలు పాటించడం ఎంత కష్టమో అందరికీ తెలిసిన విషయమే. అయితే వైఎస్ జగన్ మాత్రం విలువలు పాటించడం కోసం కష్టాలను ఎదుర్కుందాం అని చెప్తూ ఉంటాడు. ఇదే విషయాన్ని తన నాయకులు కూడా పాటించేలా చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం నరేంద్రమోడీతో సహా చంద్రబాబునాయుడు, కేసీఆర్‌లు……….ఇంకా చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీల అధినేతలే ఫిరాయించిన నాయకుల చేత అతని పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకోవాలన్న విలువలు పాటించడం లేదు. అందరికీ భయం. అలాగే విలువల కోసం నష్టపోవడానికి కూడా సిద్ధంగా ఉండడం అనే లక్షణం లేకపోవడం కూడా ఒక కారణం. పార్టీలు మారడం తప్పు అని ఎవరూ అనరు. కానీ ఏ పార్టీ నుంచి అయితే పదవి వచ్చిందో ఆ పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారడం మాత్రం పెళ్ళి ఒకరిని చేసుకుని సంసారం మరొకరితో చేస్తున్నట్టు ఉంటుంది. ఆ సంసారాన్ని ఏమంటారో ఇప్పటికే మన నాయకులు చాలా సార్లు చెప్పారు. చంద్రబాబునాయుడు అయితే తెలంగాణా ఎన్నికల సమయంలో రీసెంట్‌గా కోల్‌కతా భేరీలోనూ గొప్పగా చెప్పాడు. మళ్ళీ అదే వ్యభిచారాన్ని ఎపిలో మాత్రం నిర్లజ్జగా చేసేస్తూ ఉంటాడు. ఏకంగా మంత్రి పదవులు కూడా కట్టబెట్టేస్తాడు.
అయితే వైఎస్ జగన్ మాత్రం ఇలాంటి విలువలు లేని రాజకీయానికి అతీతంగా కనిపిస్తున్నాడు. ఆ మధ్య శిల్పా చక్రపాణిరెడ్డి చేత కూడా రాజీనామా చేయించి ఆ తర్వాతే పార్టీలో చేర్చుకున్నాడు. ఎమ్మెల్సీ అయిన రోజుల వ్యవధిలోనే రాజీనామా చేయాల్సి వచ్చినప్పటికీ శిల్పా బ్రదర్స్ మాత్రం జగన్ చెప్పిన విలువలకు కట్టుబడి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో చేరారు. ఇక ఇప్పుడు తాజాగా టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్‌రెడ్డి వైకాపాలో చేరడానికి వచ్చిన సందర్భంగా కూడా జగన్ అదే మాట చెప్పాడు. టిడిపి ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత వచ్చి పార్టీలో చేరమని చెప్పాడు జగన్. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే పార్టీని వీడుతుండడంతోనే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చంద్రబాబు పాలన పట్ల ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో, 2019 ఎన్నికల్లో చంద్రబాబు గెలిచే అవకాశమే లేదని నాయకులు కూడా ఏ స్థాయిలో నమ్ముతున్నారో ఇట్టే అర్థమయిపోతోందని విశ్లేషకులు చెప్తున్నారు.
చంద్రబాబు వ్యతిరేక ఓటుతో పాటు ప్రధానిగా ఉన్న మోడీ, రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా అధికారంలో ఉన్న కేసీఆర్, చంద్రబాబులు కూడా అనుసరించని రాజకీయ విలువలు, నైతికత కష్టమైనా సరే జగన్ అనుసరిస్తూ ఉండడం, పాదయాత్రతో ప్రజలతో మమేకం అవుతూ ఉండడం, ప్రత్యేక హోదాతో సహా ఎన్నో విషయాల్లో ఐదేళ్ళుగా చేసిన పోరాటాలు, అన్నింటికీ మించి అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు చివరి క్షణంలో జగన్ చేస్తానని చెప్పిన నవరత్నాలను కాపీ కొడుతున్న దుస్థితిలో ఉండడం లాంటి విషయాలు బేరీజు వేసకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 ఎన్నికల్లో పూర్తి ఒన్ సైడెడ్‌గా జగన్‌కి భారీ మెజార్టీ ఇవ్వనున్నారని ఒక ప్రముఖ జాతీయ ప్రతిక ఎడిటర్ వ్యాఖ్యానించడం ఎపిలో వాస్తవ పరిస్థితులను తెలియచేస్తుంది. ఏది ఏమైనా విలువలు పాటిస్తూ నైతిక రాజకీయాలు చేస్తున్న జగన్‌కి మాత్రం అన్ని వైపుల నుంచీ ప్రశంశలు దక్కుతున్నాయి.