Monday, May 5, 2025
- Advertisement -

ఏడేళ్ళ ప్రస్థానం…. ఆ విషయంలో మాత్రం జగన్‌కి సాటి వచ్చే నాయకుడు తెలుగు చరిత్రలో లేడు

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం ఎనిమిదో ఏడాదిలోకి అడుగుపెట్టింది. పార్టీని కాంగ్రెస్‌లో కలిపేస్తాడు, బిజెపిలో కలిపేస్తాడు లాంటి ఎన్నో విష ప్రచారాలు……పార్టీని సర్వనాశనం చేయాలని కొనుగోలు వ్యవహారాలతో కుతంత్రాలు, జగన్ రాజకీయ భవిష్యత్‌కి సమాధికట్టాలని చెప్పి రాజకీయ కుట్ర కేసులు……ఇలా పార్టీ పుట్టిన మరుక్షణం నుంచే కక్ష్య కట్టిన సోనియా, చంద్రబాబులాంటి సీనియర్ మోస్ట్ నాయకులను ఎదిరించి ధైర్యంగా నిలబడ్డాడు జగన్. అర్థబలం, మీడియా బలం, అంగబలం, అధికార బలం ఉన్నవాళ్ళతో పోరాటం చేస్తూనే ఉన్నాడు జగన్. కాంగ్రెస్‌ని వీడిన మరుక్షణమే భవిష్యత్‌లో తాను ఎదుర్కోబోయే కష్టాల గురించి చాలా స్పష్టంగా చెప్పాడు జగన్. ఆ తర్వాత అవన్నీ ఆచరణలో కనిపించాయి.

రాజకీయంగా, పదవుల పరంగా జగన్ ఏం విజయాలు సాధించాడు? ఎన్ని వైఫల్యాలు ఎదుర్కున్నాడు అనే విషయం పక్కనపెడితే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచీ ఇప్పటి వరకూ తెలుగు రాజకీయ చరిత్రను తీసుకుంటే అత్యంత ఎక్కువ సమయం ప్రజల సమక్షంలో ఉన్న నాయకుడిగా మాత్రం జగన్ నిలిచిపోతాడు. పార్టీ స్థాపించిన మరుక్షణం నుంచీ కూడా ప్రజలకు కష్టం వచ్చిన ప్రతిసారీ, అన్యాయం జరిగిన ప్రతి సందర్భంలోనూ జగన్ ప్రజల మధ్యనే ఉన్నాడు. నిరాహారదీక్షలు, ధర్నాలు, ఆందోళనలు, పాదయాత్ర……. ఇలా కార్యక్రమం ఏదైనా కూడా ఎక్కువ సమయంలో ప్రజల సమక్షంలో ఉన్న నాయకుడిగా మాత్రం జగన్ నిలిచిపోతాడు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఏం సాధించాడు అని చాలా మంది అమాయకత్వాన్ని నటిస్తూ ప్రశ్నిస్తూ ఉంటారు. నిజానికి ప్రతిపక్ష నాయకుడికి ఏమైనా చేసే అవకాశం ఏ ప్రభుత్వం కూడా ఇవ్వదు. పైగా నియంతృత్వ లక్షణాలు ఎక్కువ ఉండే చంద్రబాబు అస్సలు ఇవ్వడు. అలాంటి నేపథ్యంలో జగన్‌కి ఉండే ప్రత్యామ్నాయం ఒక్కటే. ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉండడం, ప్రజల సమస్యలు చర్చకు వచ్చేలా చేస్తూ ఉండడం. ఆ విషయంలో జగన్ వంద శాతం సక్సెస్ అయ్యాడు. పేపర్‌లో ప్రజల కష్టాలు చూసి చలించిపోతాడు అని పచ్చ మీడియా ప్రచారం చేసే పవన్ కళ్యాణ్ పట్టుమని పది రోజులైనా ప్రజల మధ్య ఉన్నాడా? వేరే ఏ నాయకుడైనా జగన్ స్థాయిలో ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాడా? జేసీ దివాకర్‌రెడ్డిలాంటి టిడిపి ఎంపిలు కూడా ఈ విషయంలో జగన్‌ని మెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా పల్లవిని తాజాగా మరోసారి చంద్రబాబు వినిపిస్తున్నాడంటే కారణం ఎవరు? ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యకపోతే తనకు పుట్టగతులు ఉండవని చంద్రబాబు భయపడడానికి కారణం జగన్ కాదా? ఒక ప్రతిపక్ష నాయకుడిగా అంతకుమించిన విజయం ఇంకేం ఉంటుంది? అధికారంలోకి వచ్చాక కూడా జగన్ ఇదే స్థాయిలో ప్రజల మధ్య ఉన్నాడంటే మాత్రం జగన్ కోరుకుంటున్నట్టుగా ప్రజల గుండెల్లో నిలిచిపోతాడనడంలో సందేహం లేదు. ఎక్కువ సమయం ప్రజల మధ్య ఉంటూ…..ప్రజల సమస్యలను చర్చకు వచ్చేలా చేస్తూ జగన్ సాగిస్తున్న రాజకీయ ప్రస్థానాన్ని మాత్రం ఎవ్వరైనా అభినందాల్సిందేనని జాతీయ స్థాయి మీడియాలో కూడా వార్తలు రావడం మాత్రం కచ్చితంగా అభినందనీయమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -