కోహ్లీని తప్పించడం.. సాధ్యమేనా ?

- Advertisement -

అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా రన్ మిషిన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.. రెండేళ్ల కిందటి వరకు వరల్డ్ నెంబర్ ఒన్ బ్యాట్స్ మెన్ గా రికార్డులలోనూ అలాగే అభిమానుల గుండెల్లోనూ నిలిచిన కింగ్ కోహ్లీ.. ప్రస్తుతం తన కెరియర్ లోనే అత్యంత గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. దాదాపుగా రెండేళ్ల నుంచి వరుస వైఫల్యాలతో నిరాశ పరచడమే కాకుండా..ఎన్నో విమర్శలకు తావిస్తున్నాడు. ఒకప్పుడు తన ఆటతీరును ఆకాశానికెత్తిన వారి నుంచే ఇప్పుడు కోహ్లీ ఆటతీరుపై వేలెత్తి చూపే స్థితికి పడిపోయాడు. ఒకప్పుడు కెరియర్ బెస్ట్ గణాంకాలతో రికార్డులు నెలగొల్పిన కోహ్లీ.. ప్రస్తుతం చెత్త రికార్డులకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు.

గత మూడేళ్లలో ఒక్క సెంచరీ కూడా చేయని చెత్త రికార్డుకు కోహ్లీ చేరువలో ఉన్నాడు. ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్సీ వదులుకున్న తరువాత అతని బ్యాటింగ్ లో మునుపటి ఆట తీరు కనబడడంలేదు. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో టెస్ట్, వన్డే, టి20 సిరీస్ లలో కోహ్లీ దారుణంగా విఫలం అయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో కోహ్లీని జట్టు నుంచి తప్పించాలి అని మాజీలు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే నిజంగానే కోహ్లీని జట్టు నుంచి తప్పించడం సాధ్యమేనా ? అంటే అది అంతా సులభం కాదు అని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే కోహ్లీ కెరియర్ మొదటి నుంచి కూడా వరల్డ్ టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతూ వస్తున్నాడు.. అంతే కాకుండా తన కెరియర్ లో ఎంతో మందికి సాధ్యంకాని రికార్డులు ఉన్నాయి.

- Advertisement -

ఇప్పటివరకు 70 సెంచరీలు కోహ్లీ చేశాడు.. ఒకానొక టైంలో సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డ్ కూడా కోహ్లీ అందుకునే అవకాశాలు కనిపించాయి. దాంతో కోహ్లీ స్థానాని భర్తీ చేయగల ఆటగాడు ఇప్పటికీ కూడా లేడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల కోహ్లీని జట్టు నుంచి తప్పించే సాహసం బీసీసీఐ చేసే అవకాశం లేదు. అంతే కాకుండా ఎంతో మంది అభిమానులు, సహ ఆటగాళ్లు కూడా ఫామ్ లో లేని కోహ్లీకి అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనలో కోహ్లీ ని ఎంపిక చేయకపోవడంపై విమర్శలు వస్తున్నప్పటికి కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు విశ్రాంతి అవసరమేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతునారు. ఇక కోహ్లీ దాదాపుగా మూడు నెలలపాటు సుధీర్ఘ విరామం తీసుకొనున్నాడు.. ఇక ఆ తరువాత సెప్టెంబర్ లో జరిగే టి20 వరల్డ్ కప్ కు కోహ్లీ రీఫ్రెష్ గా అడుగు పెట్టె అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

పతనమైన రూపాయి.. దేనికి సంకేతం !

తైవాన్ చిచ్చు.. అమెరికా-చైనా వార్ ?

సరిహద్దు రచ్చ.. సద్దుమనిగేనా ?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -