ఐపీఎల్ 2019 మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అయితే ఆట ఇంకా మొదలు కాకుండానే ఆటగాళ్లు విమర్శలు చేసుకోవడం సంచలనంగా మారింది. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంభీర్ మాట్లాడుతు… ఆర్సీబీని ఐపీఎల్ టైటిల్ విన్నర్‌గా నిలవలేనంత మాత్రాన కోహ్లి కెప్టెన్సీని తప్పుపట్టాల్సిన అవసరం లేదని కామెంట్స్ చేశారు. ఇదే సందర్భంలో ధోని, రోహిత్‌శర్మ మూడుసార్లు వారి వారి జట్లను విజేతగా నిలిపారని గుర్తు చేశారు.వారిని పొగుడుతు కోహ్లిని కొంచెం కించపరిచాడు గంభీర్. తాజాగా దీనిపై స్పందించాడు కోహ్లీ. గంభీర్ తన గురించి చేసిన కామెంట్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు కోహ్లీ.
కొంత మంది ఇంట్లో కూర్చుని క్రికెట్ గురించి ఏమాత్రం అవగాహన లేని వారిలా మాట్లాడుతుంటారు అంటూ గంభీర్‌కు కౌంటర్ ఇచ్చాడు. ఐపీఎల్ టైటిల్ గెలిచానా లేదా అన్న విషయంపై నన్ను జడ్జ్ చేయడం ఏమాత్రం సరైంది కాదు. నిజానికి ఒక క్రీడాకారుడి ప్రతిభను అంచనా వేయడానికి ఎటువంటి ప్రమాణాలు లేవని తెలిపాడు. వాళ్లలాగే ఇంట్లో కూర్చుంటాననుకుంటున్నారేమో అని గంభీర్‌కు కోహ్లి చురకలు అంటించాడు. ఇక గంభీర్ నిన్ననే బీజేపీ పార్టీలో చేరారు. ఆయన ఢిల్లీ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయాని తెలుస్తోంది.
- Advertisement -
గంభీర్‌కు కౌంటరిచ్చిన కోహ్లీ
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -