మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భాగంగా కివీస్‌తో వెల్లింగ్టన్‌లో తొలి టి20 జరుగుతోంది. టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లికి విశ్రాంతిని ఇవ్వడంతో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు. వెస్టిండీస్, ఆస్ట్రేలియాలపై టి20 సిరీస్‌లకు తప్పించిన వెటరన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.గాయం, సస్పెన్షన్‌తో కొన్నాళ్లుగా అంతర్జాతీయ టీ20లు ఆడని ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ మ్యాచ్ ఆడుతున్నాడు.కోహ్లీ లేకపోయినప్పటికి భారత జట్టు బలంగానే కనిపిస్తోంది. ఇక బౌలింగ్‌లో భువనేశ్వర్‌కు తోడు రెండో పేసర్‌గా ఖలీల్‌ను తీసుకున్నారు.
ఆతిథ్య జట్టు డాషింగ్ ఓపెనర్ గప్టిల్, ప్రధాన పేసర్ ట్రెంట్ బౌల్ట్ లేకుండానే ఈ మ్యాచ్ ఆడుతోంది. కివీస్‌పై టీ20లలో భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు. ఇప్పటిక వరకు టీ20 లలో కివీస్ జట్టు భారత్‌పై తన అధిపత్యాన్ని చూపిస్తు వచ్చింది. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి తమ అధిపత్యాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇటు భారత జట్టు కూడా కివీస్‌పై తొలి టీ20 మ్యాచ్ గెలవలని పట్టుదలో ఉంది.
- Advertisement -
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -