ఐపీఎల్ 2025లో భాగంగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలె ఐపీఎల్ వేలం ముగియగా తాజాగా కోల్ కతా నైట్ రైడన్స్ కెప్టెన్ ను ప్రకటించింది. ఇక ఈ సారి వేలంలో కోల్ కతా అత్యధికంగా ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. దీంతో ఈ సారి కేకేఆర్ సారధి వెంకటేశ్ అయ్యరే అని అంతా భావించారు.
కానీ క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం సీనియర్ ఆటగాడైన రహానేకు సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి వేలంలో మొదట రహానేను ఎవరూ తీసుకోలేదు. అయితే రెండో రౌండ్‌లో రహానేను రూ.1.50 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకోగా సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని రహానేను కెప్టెన్ చేయాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోందని తెలుస్తోంది.
2024లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కేకేఆర్ విజేతగా నిలవగా ఈసారి అతడిని వదులుకుంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ రూ.26.75 కోట్లకు శ్రేయాస్‌ను దక్కించుకుంది.