భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చారు. ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్,శ్రేయాస్,ఇషాన్ కిషన్ విఫలం కావడంతో భారత బ్యాటింగ్‌పై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ముఖ్యంగా రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
ఆఫ్ఘాన్ బౌలర్లను ఊచకోత కోస్తూ రోహిత్ 63 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి ఈ ఫీట్ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా హిట్ మ్యాన్ 84 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సులతో 131 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇక ఈ మ్యాచ్‌లో సిక్స్‌లు కొట్టడం ద్వారా అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు గేల్ పేరు మీదున్న ఈ రికార్డును అధిగమించాడు రోహిత్.
ఇప్పటివరకు జరిగిన వన్డే వరల్డ్ కప్పులలో ఎనిమిది సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డ్ నెలకొల్పాడు. ఇక రోహిత్ ఫామ్‌లోకి రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతుండగా మొదటి రెండు మ్యాచ్ లకు దూరమైన స్టార్ ఓపెనర్ శుబ్ మన్ గిల్.. పాక్ తో జరిగే మ్యాచ్ కు అందుబాటులో వస్తాడని తెలుస్తోంది. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఫామ్‌లోకి రావడం దీనికి తోడు పాక్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండటంతో పాక్‌కు కళ్లెం వేయడం ఖాయమని అంతా భావిస్తున్నారు. ఏదిఏమైనా భారత బ్యాట్స్‌మెన్ తిరిగి గాడిలో పడటంతో ప్రపంచకప్ గెలవడం ఖాయమనే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.