Thursday, April 25, 2024
- Advertisement -

ఆస్ట్రేలియన్ ఓపెన్లో కరోనా..స్వీయ నిర్బంధంలోకి ఆటగాళ్ళు..!

- Advertisement -

ఆస్ట్రేలియన్ ఓపెన్​లో కరోనా కేసులు వచ్చాయి. టోర్నీలో భాగస్వామ్యమైన ఇద్దరికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహణాధికారి ఒకరు తెలిపారు. వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు.

ఇటీవల పూర్తయిన ఆస్ట్రేలియన్ ఓపెన్​ క్వాలిఫయర్స్​లో అర్హత సాధించిన ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బంది.. ఉదయం ప్రత్యేక విమానంలో అతిథ్య దేశానికి చేరుకున్నారు. వీరిందరికీ అక్కడ చేసిన కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో ఇద్దరికి వైరస్​ సోకినట్లు తేలింది. దీంతో ఆ విమానంలో ప్రయాణం చేసిన మిగతావారందరినీ 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి పంపించారు నిర్వహకులు. ఫిబ్రవరి 8 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్​ ప్రారంభం కానుంది.

అంతకముందు చేసిన వైద్య పరీక్షల్లో మాజీ ప్రపంచ నంబర్‌ వన్ ఆండీ ముర్రే కరోనా బారిన పడినట్లు తేలింది. దీంతో అతడు ఆడేది అనుమానంగా మారింది. ప్రస్తుతం లండన్‌లోని తన ఇంట్లో ఐసోలేషన్‌లో ఉన్నాడు ముర్రే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -