టీమిండియా – శ్రీలంక మధ్య ఈ నెల 27 నుండి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. సూర్య సారథ్యంలో గంభీర్ కోచ్‌గా టీమిండియా తొలిసారి శ్రీలంకలో పర్యటించనుండగా ఈ సిరీస్‌పై అందరి దృష్టి నెలకొంది.
ఇక శ్రీలంక జట్టు సైతం టీమ్ కూర్పులో పెను మార్పులు చేసింది. వానిందు హసరంగా సారథి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో చరిత్ అసలంకకు జట్టు పగ్గాలు అప్పగించింది.ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పారు. అసలంక మూడు టెస్టులు, 59 వన్డేలు, 47 టీ20లు ఆడాడు.
ఇక జట్టులో సీనియర్లను తప్పించింది శ్రీలంక. ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డిసిల్వాను తప్పించి దినేశ్ చండిమాల్, కుషాల్ పెరీరా, అవిష్క ఫెర్నాండోను టీమ్‌లోకి తీసుకున్నారు.
శ్రీలంక టీ20 జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, అవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, దినేష్ చండిమాల్, కామిందు మెండిస్, దసున్ షనక, వానిందు హసరంగా, దునిత్ వెల్లలగే, మహేశ్ తీక్షణ, చమిందు విక్రమసింఘే, మతీషా పతిరనా, నువాన్ తుషారా, దుష్మాంత చమీర, బినూర ఫెర్నాండో.