పాకిస్తాన్ క్రికెటర్ ఫఖర్ జమాన్‌పై సోషల్ మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలుతున్నాయి. ఆసియాకప్‌లో భాగంగా సూపర్-4లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన పోరులో భారత్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫకార్ జమాన్ వినూత్నంగా ఔట్ అవ్వడంతో ఆతనిపై సోషియల్ మీడియాలో ఫన్నీ జోకులు పేలుతున్నాయి.
కుల్దీప్ వేసిన 14వ ఓవర్‌లో స్లాగ్ స్వీప్ షాట్ ఆడే క్రమంలో పట్టు కోల్పోయిన ఫఖర్ వికెట్ల ముందు అడ్డంగా పడిపోగా అంపైర్ వెంటనే ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాడు. దీనిపై సందిగ్ధం వ్యక్తం చేస్తూ నాన్ స్ట్రైకర్‌ను అడగ్గా అతను ఏం చెప్పకపోవడంతో ఫఖర్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే రీప్లేలో బంతి అతని గ్లవ్‌కు తాకిందని తేలింది. అప్పీల్‌కు వెళితే ఫఖర్ బతికిపోయేవాడు.
ఫకార్.. ధావన్ కోసం పిచ్ శుభ్రం చేస్తున్నావా?’ అని ఒక నెటిజన్ ట్వీట్ చేయగా, మరొక నెటిజన్ ఫకార్‌ను వెంటనే జింబాంబ్వే పంపించాలని ట్వీట్ చేశారు. బ్యాటింగ్ చేయమంటే ఫకార్ మాధురీ దీక్షిత్‌లా డ్యాన్స్ చేస్తున్నాడని, స్వచ్ఛ భారత్ ప్రచారంలో భాగంగా ఫకార్ తనవంతు కృషిచేస్తున్నారని ట్విట్టర్‌లో ట్రోల్ చేస్తున్నారు.
https://twitter.com/iamkhurrum12/status/1043845090857373697