Saturday, May 3, 2025
- Advertisement -

ఆసీస్‌ క్రికెటర్లకు లై డిటెక్టర్ టెస్టు!

- Advertisement -

ఆసీస్ క్రికెటర్లకు లై డిటెక్టర్ పరీక్షకు సంబంధించిన న్యూస్ వైరల్‌గా మారింది. ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌కు లై డిటెక్ట‌ర్ టెస్టు నిర్వహించగా వారు చెప్పిన సమాధానాలు వైరల్‌గా మారాయి. ఓ టీవీ షోలో ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్,మిచెల్ మార్ష్, మార్న‌స్ ల‌బూషేన్, ఓపెన‌ర్ ఉస్మాన్ ఖ‌వాజాలు లై డిటెక్ట‌ర్ టెస్టుకు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా క్రికెట‌ర్ల చేతుల‌కు ఓ బ్యాండేజ్ క‌ట్టారు. తొలి రౌండ్‌లో భాగంగా వాళ్ల‌ను మీ అస‌లు పేరు ఏంటీ? అని అడిగారు. ఆ త‌ర్వాత కంగారూ ఆట‌గాళ్లను ప‌లు వివాదాస్ప‌ద‌, ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు అడిగారు. తొలుత ఇంగ్లండ్ క్రికెట‌ర్లు జానీ బెయిర్‌స్టో, స్టువార్ట్ బ్రాడ్‌ల‌ను ఫ్లాంగ్స్ అని పిల‌వ‌నుందుకు క‌మిన్స్, మార్ష్‌ల‌కు క‌రెంట్ షాక్ త‌గిలింది.

వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సెంచ‌రీతో మెరిసిన ట్రావిస్ హెడ్ ను వైన్ కాకుండా ఐదు కంటే ఎక్కువ బీర్లు తాగావా? ప‌ది.. 25 బీర్లు లాగిప‌డేశావా? అని నిర్వాహ‌కుడు అడుగ‌గా.. అందుకు హెడ్ నో అంటాడు. దీంతో లై డిటెక్ట‌ర్ గుర్తించగా హెడ్‌కు షాక్ త‌గులుతుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -