శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్‌లకు భారత జట్టు సిద్ధమయ్యింది. భారత పర్యటనలో శ్రీలంక మూడు టెస్ట్ లు అడాల్సి ఉంది. దీంతో టెస్టు సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించిన సెలక్టర్లు యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి కల్పించారు. టీమ్ మేనేజ్‌మెంట్‌ను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
ఈ నెల 16 నుంచి టీమిండియా, శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం మూడు టెస్టు మ్యాచులు జరగనున్నాయి. శ్రీలంక సిరీస్ తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌లో సుదీర్ఘంగా పర్యటించనుంది. ఈ నేపథ్యంలో పాండ్యపై పని ఒత్తిడి లేకుండా చూసేందుకు, గాయాల బారిన పడకుండా ఉండేందుకు విశ్రాంతినిచ్చారు.
స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఈనెల 16న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో తొలి టెస్టు ఆరంభమవుతుంది.
భారత జట్టు
విరాట్ కోహ్లీ (సారథి), కేఎల్ రాహుల్, మురళీ విజయ్, శిఖర్ ధావన్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (ఉప సారథి), రోహిత్ శర్మ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ.