ధోని సారథ్యంలోని చైన్నై సూపర్ కింగ్స్ అన్ని జట్లకంటే ముందే ప్లే ఆఫ్‌కు చేరింది. మంగళవారం రాత్రి సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 175 పరుగులు చేసింది. మనీశ్ పాండే (83 నాటౌట్), వార్నర్ ( 57) అర్థసెంచరీలతో రాణించారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చైన్నై జట్టు 19.5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి గెలిచింది. వాట్సన్ (96) చెలరేగి ఆడాడు. వాట్సన్ ఆడుతున్నంతసేపు సన్‌రైజర్స్ బౌలర్లు చూస్తుండిపోయారు.
మ్యాచ్ చివర్లో వాట్సన్ అవుట్ కావడంతో , చైన్నైపై కాస్తా ఒత్తిడి పెంచింది సన్‌రైజర్స్. మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకుచ్చారు సన్‌రైజర్స్ బౌలర్లు. మరో మంతి మిగిలి ఉండగా చైన్నై సూపర్ కింగ్స్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్ విజయంతో చైన్నై ఖాతాలో 16 పాయింట్లు వచ్చి చేరాయి. దీంతో ప్లే ఆఫ్‌కు చేరిన మొదటి జట్టుగా చైన్నై రికార్డు సృష్టించింది. అయితే ఇది అధికారంగా ధృవీకరించాల్సి ఉంది. చేలరేడి ఆడిన వాట్సన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
- Advertisement -
ప్లేఆఫ్‌కు చేరిన చైన్నై సూపర్ కింగ్స్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -