Thursday, April 25, 2024
- Advertisement -

క్రికెట‌ర్ బ్రావో మ‌న‌సులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్…

- Advertisement -

వెస్ట్ ఇండీస్ క్రికెటర్ బ్రావో ఐపీఎల్‌లో చెన్నై సూప‌ర్‌కింగ్స్ త‌రుపున ఆడుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే బ్రావో త‌న మ‌న‌సులో ఉన్న హీరోయిన్ పేరును బ‌య‌ట‌పెట్టారు. బాలీవుడ్ నటీమణి దీపికా పదుకొనె తన మనసుపై ఎంతో ప్రభావం చూపించినట్టు చెప్పారు.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడిగా ఐపీఎల్ సీజన్ లో బిజీగా ఉన్న బ్రావో తన జట్టు సహచరుడు హర్బజన్ సింగ్ తో దీపికా పదుకొనె అంటే తనకు ఎంత అభిమానమో తెలియజేశాడు. అభిమాన నటి అంటే బ్రావోకు 34 ఏళ్ల దీపికా పదుకొనే మాత్రమే గుర్తుకు వస్తుందట.

2006లో చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మొదటి సారి భారత పర్యటనకు వచ్చినప్పుడు హోటల్ గదిలో టీవీలో వచ్చిన ఓ సబ్బు ప్రకటనలో దీపికను చూశాడు బ్రావో. అప్పటి నుంచి ఆమె తన మనసులోనే నిలిచిపోయినట్టు తెలిపాడు. తన అభిమాన నటిని ఓ సారి కలుసుకుని, ఆమెతో ముచ్చటించాలన్నది తన చిరకాల కోరికగా పేర్కొన్నాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -