ఐపీఎల్ 2025 జోరుగా సాగుతోంది. అయితే ఈ సారి చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఆశించిన ప్రదర్శన ఇవ్వడం లేదు. ఈ సంగతి పక్కన పెడితే ఐపీఎల్‌లో చెన్నైకి ప్రాతినిధ్యం వహించాడు అంబటి రాయుడు. ప్రస్తుతం కామెంటేటర్‌గా మారిన అంబటి రాయుడు…ఛాన్స్ దొరికినప్పుడల్లా ధోనిని పొగుడుతూనే ఉంటాడు.
ఈ నేపథ్యంలో చెన్నైకి చెందిన మాజీ ఆటగాడు బ్రేవో…తన టీమ్ మేట్స్ విషయంలో ధోని తీసుకునే కేర్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టాడు. ముంబై ఇండియన్స్, సీఎస్‌కే రెండు టీమ్స్ కూడా నాకు ఇష్టమే. అయితే చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఎక్కువ ఇష్టం అన్నాడు.
సీఎస్‌కేలో ధోనీ, బాస్‌లా మన చుట్టూ ఉంటాడు.. ధోనీ, టీమ్‌లోని ప్రతీ ప్లేయర్‌ని అర్థం చేసుకుని, వాళ్లకేం కావాలో అది సమకూరుస్తూ ఉంటాడు అని చెప్పుకొచ్చాడు.
ధోనీకి కోపం వచ్చిందంటే, కచ్ఛితంగా ఏదో తప్పు చేసి ఉంటారు. ఓ సారి అశ్విన్, ఈజీ క్యాచ్‌ని డ్రాప్ చేశాడు. ధోనీ వెంటనే అతన్ని స్లిప్స్ నుంచి తప్పించి, వేరే ప్లేస్‌లో ఫీల్డింగ్‌కి పెట్టాడు. నాకు తెలిసి గ్రౌండ్‌లో ధోనీ కోపడ్డడం చూసింది అప్పుడేనన్నాడు.
అలాగే అంబటి రాయుడు…ధోని కోసం ఇంటి నుండి క్యారేజ్ తీసుకుని వచ్చాడు. అయితే హోటల్ స్టాఫ్ దీనిని అనుమతించకపోవడంతో కోపంతో ధోని హోటలే మారిపోయాడని తెలిపాడు. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు… కానీ ధోనీ కోసం ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన అంబటి రాయుడికి చాలా పెద్ద విషయం అని తెలిపాడు.