Monday, May 5, 2025
- Advertisement -

రాహుల్ ద్రావిడ్ కొడుకు అదరగొట్టాడు

- Advertisement -

టీమిండియా మాజీ ఆట‌గాడు,ప్ర‌స్తుత అండర్‌-19 కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ వారసుడు సమిత్‌ ద్రవిడ్ అండర్‌-14 టోర్నీలో అదరగొట్టాడు.బెంగళూరులో జరిగిన అండర్‌-14 టోర్నీలో ఈ 12 ఏళ్ల చిన్న ద్రవిడ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అధితి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ తరపున బరిలోకి దిగిన సమిత్‌ అర్థ సెంచరీతో పాటు 4 వికెట్లు పడగొట్టి విజయం కీలక పాత్ర పోషించాడు. దీంతో కెంబ్రిడ్జి పబ్లిక్‌ స్కూల్‌పై సమిత్‌ జట్టు 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సమిత్‌.. ఇలా ఆకట్టుకోవడం ఇదే తొలిసారేం కాదు. జనవరిలో కర్ణాటక స్టేట్‌ క్రికెట్‌ అసోసియేషన్స్‌ (కేఎస్‌సీఏ) నిర్వహించిన బీటీఆర్‌ కప్‌లో సమిత్‌ 150 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అండర్‌-12 టోర్నీల్లో అత్యధిక పరుగుల సాధించిన క్రికెటర్‌గా గుర్తింపు కూడా పొందాడు.ద్రవిడ్‌ అండర్‌-19 కోచ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -