IPL:విదేశీ ఆటగాళ్లు అనుమానమే!

ఈ నెల 17 నుండి ఐపీఎల్ 2025 ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టోర్నమెంట్ వారం రోజుల పాటు వాయిదా పడిన సంగతి తెలిసిందే. టోర్నమెంట్ వాయిదా పడటంతో విదేశీ ఆటగాళ్లు తమ స్వదేశాలకు వెళ్లిపోయారు. అయితే వీరు తిరిగి టోర్నమెంట్‌లో పాల్గొనడం కష్టమే.

ఎందుకంటే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు వచ్చే నెల 11 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్స్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఉండగా ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లకు మధ్య సీరిస్ జరగనున్న నేపథ్యంలో ఈ దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండటం కష్టమే.

ఐపీఎల్‌కు దూరమయ్యే విదేశీ ఆటగాళ్లు వివరాలను పరిశీలిస్తే.. గుజరాత్ : రబాడ, షెఫానీ రూథర్ ఫర్డ్, కొయెట్జీ,ఢిల్లీ : మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రెజర్, ట్రిస్టన్ స్లబ్స్,
బెంగళూరు : జోష్ హాజిల్‌వుడ్, జాకబ్ బెథెల్, లుంగిసాని ఎంగిడి,లక్నో : మార్ క్రమ్,పంజాబ్ : మార్కో యాన్సెన్,ముంబై : రికిల్ టన్,చెన్నై : సామ్ కరన్,
రాజస్థాన్ : జోఫ్రా ఆర్చర్ ఆడటం అనుమానేనని తెలుస్తోంది. దీనిపై అఫిషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.