ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ని విజేతగా నిలపడంలో ప్రముఖ పాత్ర ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్‌ది. ప్రతి మ్యాచ్‌లో తన మార్క్‌ను స్పష్టంగా చూపించారు గంభీర్. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రేసులో ప్రముఖంగా గంభీర్ పేరు వినిపిస్తోంది
గత సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ నుండి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి గెలిచారు గంభీర్. అయితే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండగా కోల్ కతా మెంటర్‌గా ఎంట్రీ ఇచ్చారు. దీనికితోడు బీసీసీఐ హెడ్ కోచ్‌గా ఉన్న ద్రావిడ్ పదవీకాలం ఈ టీ20 వరల్డ్ కప్ తర్వాత ముగియనుంది. దీంతో ఇప్పటికే కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించింది బీసీసీఐ. దాదాపు 3వేలకు పైగా దరఖాస్తులు రాగా త్వరలోనే షార్ట్ లిస్ట్ చేయనున్నారు.
ఇక ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత గంభీర్‌తో జైషా ప్రధానంగా చర్చించడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే గంభీర్ పేరు ఫైనల్ కావడం దాదాపు ఖాయమని సమాచారం.