Wednesday, May 7, 2025
- Advertisement -

భాజాపాలో చేర‌నున‌క్న ప్ర‌ముఖ క్రికెట‌ర్‌…

- Advertisement -

భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ క్రియాశీలక రాజకీయాల్లోకి రానున్నాడనే వార్త హల్‌చల్ చేస్తోంది. పేలవ ఫామ్‌ కారణంగా జట్టులో చోటు కోల్పోయిన ఈ ఢిల్లీ బ్యాట్స్‌మెన్ గత రెండేళ్లుగా టీమిండియాకి దూరంగా ఉంటున్నాడు. 36 ఏళ్ల గౌతమ్ గంభీర్ మళ్లీ టీమిండియాలోకి పునరాగమనం చేయడం కష్టమని భావించి క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి రావాల‌నుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇప్ప‌టికే గౌత‌మ్ గంభీర్‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన ఢిల్లీ భాజాపా నేత‌లు టికెట్ ఇవ్వడంపై కూడా స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. భారత్ జట్టు 2011‌లో వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన గౌతమ్ గంభీర్.. ఆ తర్వాత ఫామ్, ఫిట్‌నెస్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ మధ్యలోనే ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెప్టెన్సీని వదిలేసిన గంభీర్.. ఆ తర్వాత సీజన్ ముగిసే వరకూ కనీసం ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. దీంతో.. వచ్చే ఏడాది అతను ఐపీఎల్ ఆడటంపైనా అనుమానాలు నెలకొన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -