- Advertisement -
టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది ఐసీసీ. ఈ ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు భంగపాటు తప్పలేదు. టాప్-30లో కూడా నిలవలేదు రోహిత్ శర్మ. ఆరు స్థానాలు దిగజారి ఏకంగా 31వ స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీ కూడా ఐదు స్థానాలు కిందకు పడిపోయి 20వ ర్యాంకులో నిలిచాడు.
ఓపెనర్ యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా, రిషబ్ పంత్ మూడు స్థానాలు దిగజారి 9వ ర్యాంకులో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ మాత్రం ఒక స్థానం మెరుగుపరుచుకుని 17వ స్థానంలో నిలిచాడు. నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం ఆరు స్థానాలు ఎగబాకి 69వ ర్యాంకును దక్కించుకున్నాడు.
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా అగ్ర స్థానంలో కొనసాగుతుండగా, అశ్విన్ ఒక స్థానం కిందకు దిగి ఐదులో, రవీంద్ర జడేజా ఆరో స్థానంలో కొనసాగుతున్నారు.