Sunday, May 4, 2025
- Advertisement -

స‌చిన్‌, ద్ర‌విడ్‌కు సాధ్యం కానిది కోహ్లీ సాధించాడు….

- Advertisement -

టీమిండియా సార‌థి విరాట్ కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సాధించాడు. ఐసీసీ ప్రకటించిన తాజా టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లి 900 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. 900 పాయంట్ల మార్క్‌ను అందుకున్న రెండ‌వ క్రికెట‌ర్‌గా కోహ్లీ రికార్డు నెల‌కొల్పాడు.

1979లో ది ఓవల్‌లో జరిగిన టెస్టులో 221 పరుగులు చేసిన గావస్కర్ 916 పాయింట్లు సాధించాడు. భారత క్రికెటర్‌కు టెస్టుల్లో ఇదే అత్యుత్తమ రేటింగ్ పాయింట్. దాదాపు 39 ఏళ్లపాటు మరే భారత క్రికెటర్ కూడా 900 పాయింట్ల మార్కును అందుకోలేకపోయాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో 153 పరుగులు చేసిన కోహ్లి.. 880 పాయింట్లను 900 పాయింట్లకు ఎగబాకాడు. దీంతో సచిన్, ద్రావిడ్ లాంటి దిగ్గజ క్రికెటర్లకు సైతం సాధ్యం కాని అరుదైన ఫీట్‌ను విరాట్ కోహ్లి అందుకున్నాడు. సచిన్, ద్రావిడ్ 900 పాయింట్లకు చేరువగా వచ్చారు. కానీ ఆ మార్క్‌ను మాత్రం అందుకోలేకపోయారు. సచిన్ 2002లో అత్యధికంగా 898 పాయింట్లు సాధించగా.. ద్రావిడ్ 2005లో 892 పాయింట్ల మార్క్‌ను అందుకున్నాడు.

టెస్టు క్రికెట్లో 900 పాయింట్ల మార్క్‌ను అందుకున్న 31వ బ్యాట్స్‌మెన్ కోహ్లి కావడం విశేషం. ఇప్పటి వరకూ మరెవరికీ సాధ్యంకాని రీతిలో ఆస్ట్రేలియా లెజెండ్ డాన్ బ్రాడ్‌మ్యాన్ 961 పాయింట్లు సాధించాడు. టెస్టుల్లో ఇప్పటి వరకూ ఇదే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు కాగా.. 947 పాయింట్లతో స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. లెన్ హట్టన్ (945), రికీ పాంటింగ్, జాక్ హోబ్స్ సంయుక్తంగా 942 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో స్మిత్ అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లి తిరిగి (900 పాయింట్లు) రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోయ్ రూట్ మూడో స్థానంలో, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ నాలుగోస్థానంలో నిలిచారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -