ఆసిస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కు ఆసిస్ షాక్ ఇచ్చింది. స్వల్ప పరుగుల వ్యవధిలోనే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు ధావన్(1)రోహిత్(14)పరుగులతో వెనుదిరిగారు. నాలుగో ఓవర్‌లో ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా రిచర్డ్‌సన్ విసిరిన బంతిని.. పాయింట్ దిశగా హిట్ చేసేందుకు ధావన్ ప్రయత్నించగా.. సరిగా కనెక్ట్ అవ్వని బంతి నేరుగా ఫీల్డర్ మాక్స్‌వెల్ చేతుల్లోకి వెళ్లింది. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో ఓపెనర్ రోహిత్ శర్మ కూడా పాట్ కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అనంతరం జట్టులోకి వచ్చిన కోహ్లీ మ్యాచ్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినప్పటికి సహాకారాన్ని అందించాల్సిన రాయుడు కూడా కమిన్స్ బౌలింగ్‌లో బోల్డ్ అయ్యాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ 50 ఓవర్ల నష్టానికి 5 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో కోహ్లీ 17 పరుగులు, ధోని 10 పరుగులతోనూ ఉన్నారు.13 ఓవర్లకు 46 పరుగులతో టీమిండియా ఆడుతోంది.
- Advertisement -
పీకల్లోతు కష్టాల్లో టీమిండియా….
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -