Sunday, May 4, 2025
- Advertisement -

గంగూలి స‌ర‌స‌న కోహ్లీ….

- Advertisement -

ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో బాక్సింగ్ డే టెస్ట్ గెల‌వ‌డం ద్వారా కోహ్లీ మ‌రో అరుదైన రికార్డును సాధించారు. మూడో టెస్ట్‌లో భారత్‌ 137 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. చివరిరోజు ఆటలో ఆసీస్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ భారీ విజయం సాధించింది .

తాజా విజ‌యంతో కోహ్లీ గంగూలి స‌ర‌స‌న చేరారు. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో సౌరవ్‌ గంగూలీతో కలిసి కోహ్లి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఇప‍్పటివరకూ విదేశాల్లో 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించిన కోహ్లి 11 విజయాలు సాధించాడు. ఆసీస్‌తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా గెలుపు తర్వాత గంగూలీతో కలిసి టాప్‌ను ఆక్రమించాడు.

ఇక మాజీ కెప్టెన్ గంగూలీ విష‌యానికి వ‌స్తే విదేశాల్లో 28 టెస్టుల్లో సారథ్యం వహించి 11 విజయాలు సాధించగా, కోహ్లి 24 టెస్టుల్లోనే ఆ గెలుపు మార్కును చేరుకున్నారు. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన భారత కెప్టెన్ల జాబితాలో గంగూలీ, కోహ్లిల తర్వాత స్థానాల్ల ఎంఎస్‌ ధోని(6), రాహుల్‌ ద్రవిడ్‌(5)లు ఉన్నారు.

2018 ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జోహనెస్‌బర్గ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ను గెలిచిన భారత్‌.. ఇంగ్లండ్‌తో ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఆపై ఆసీస్‌తో ప్రస్తుత సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌, మెల్‌బోర్న్‌ టెస్టులు భారత్‌ ఖాతాలో చేరాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -