ప్రపంచకప్ సమరంలో భాగంగా బంగ్లాతో ఆడుతున్న వార్మఅప్ మ్యాచ్‌లో భారత్ భారీ స్కోరు చేసింది. ఆదిలోనె శిఖర్, రోహిత్ వికెట్లు కోల్పోయినా రాహుల్, ధోనిలు సెంచరీతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. స్ట్రోక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ (108; 99 బంతుల్లో 12×4, 4×6), ఎంఎస్ ధోనీ (113; 78 బంతుల్లో 8×4, 7×6) అద్వితీయ శతకాలతో చెలరేగడంతో ప్రత్యర్థికి టీమిండియా 360 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. శిఖర్ ధావన్ (1; 9 బంతుల్లో) జట్టు స్కోరు 5 వద్దే ఔటయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (19; 42 బంతుల్లో 1×4) పేవల బ్యాటింగ్‌తో వికెట్ చేజార్చుకున్నారు. తక్కువ పరుగులకే ఓపెనర్లు వెనుదిరగడంతో సారథి విరాట్ కోహ్లీ (47; 46 బంతుల్లో 5×4) నిలకడగా రాణించాడు. అర్ధశతకం ముంగిట సైఫుద్దీన్ వేసిన యార్కర్‌కు బలయ్యాడు.
రాహుల్ శతకంతో చెలరేగడంతో నాలుగో స్థానంలో ఎంతటి కీలకమైన ఆటగాడినో నిరూపించుకున్నారు. ధోనీతో కలసి చక్కటి భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇద్దరూ రాణించడంతో రాణించడంతోనే 22 ఓవర్లకు 102/4తో ఉన్న స్కోరు 44 ఓవర్లకు 268/5కు చేరుకుంది.రాహుల్ నిష్ర్కమణ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య (21; 11 బంతుల్లో 2×4, 1×6) మెరిశాడు. విజయ్ శంకర్ (2; 7 బంతుల్లో), దినేశ్ కార్తీక్ (7; 5 బంతుల్లో) విఫలమయ్యారు.