Saturday, May 3, 2025
- Advertisement -

భారత్ – పాక్ మ్యాచ్‌లన్నీ..అక్కడే!

- Advertisement -

పాకిస్థాన్ వేదికగా వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫి జరగనున్న సంగతి తెలిసిందే. పాక్ వేదికగా జరిగే ఈ ట్రోఫీలో పాల్గొనబోమని భారత ప్రభుత్వం నిరాకరించగా హైబ్రిడ్ విధానంలో టోర్నీలో పాల్గొనేందుకు బీసీసీఐ ఓకే చెప్పింది.

తొలుత పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒప్పుకోకపోయినా ఐసీసీ సూచనతో వెనక్కి తగ్గింది. దీంతో ఈ ట్రోఫీలో భారత్ ఆడాల్సిన మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి.

గురువారం ఐసీసీ చైర్మన్ జైషా, బోర్డు సభ్యుల మధ్య సమావేశం జరుగగా ఈ సమావేశంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది అక్టోబర్ లో మహిళల వన్డే ప్రపంచ కప్ కు భారత్ అతిథ్యమివ్వనుంది. ఈ టోర్నీలో పాక్ మ్యాచ్ లు భారత్ వెలుపల జరిగే అవకాశం ఉంది.

2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ ను శ్రీలంకతో కలిసి ఉమ్మడిగా భారత్ నిర్వహించనుంది. ఇందులో పాకిస్థాన్ మ్యాచ్ లకు శ్రీలంక వేదికగా ఉండే ఆస్కారముంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ సహా మొత్తం 15 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. ఒకవేళ భారత జట్టు ఫైనల్ కు చేరకపోతే.. లాహోర్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -