సఫారీలతో పోరుకు భారత్ సిద్దమవుతోంది. సఫారీలతో సుదీర్ఘమైన సిరీస్ ఆడేందకు సౌత్ఆప్రికా చేరుకుంది. జనవది 5 మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. దీంతో భారత్ ప్రాక్టీస్ మొదలట్టేసింది. ప్రధాన కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చాలా సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. నెట్స్‌లో టీమిండియా ఆటగాల్లంతా చెమటోడ్చుతున్నారు.
అనుష్కతో వివాహం నేపథ్యంలో క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ఆటపై ఏకాగ్రత కేంద్రీకరించేందుకు కెప్టెన్ నెట్స్‌లో ఎక్కువ సేపు చెమటోడ్చినట్లు తెలిసింది.
కోహ్లితో పాటు శనివారం ప్రాక్టీస్ సెషన్‌కి మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా కూడా వచ్చాడు. వన్డే, టీ20 జట్టులో స్థానం లేకపోయినా.. ఏ మాత్రం నిరుత్సాహపడకుండా టెస్టుల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడుతూ పుజారా ఆకట్టుకుంటున్నాడు. కఠినమైన ఈ సఫారీ పర్యటనలో కోహ్లి తర్వాత పుజారానే కీలక ఆటగాడని మాజీ క్రికెటర్లు ఇప్పటికే కితాబిచ్చారు. జనవరి 5 నుంచి మూడు టెస్టుల సిరీస్ ఆరంభంకానుంది. సఫారీలకు ఎంత పోటీ ఇస్తారో చూడాలి.
Getting into the groove is #TeamIndia captain @imVkohli pic.twitter.com/ybNqEWVKRm
— BCCI (@BCCI) December 30, 2017