ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆర్సీబీ ఆటపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది.శనివారం బెంగళూరులోని చిన్నస్వామి మైదానం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘనవిజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో విజయంతో ఈ సీజన్‌కు ఆ జట్టు మంచి ముగింపు పలికింది.మ్యాచ్ అనంతరం ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడాడు.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో తొలి సగభాగం తాము పూర్తిగా విఫలం అయ్యామని, రెండో అర్ధభాగంలో తమ జట్టు సూపర్ హిట్ అయిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు.చివరి 7 మ్యాచ్ లలో 5 విజయాలను నమోదు చేశామని గుర్తు చేసిన కోహ్లీ, తొలి 7 మ్యాచ్ లలోనూ ఇదే తరహా ఫలితాలను నమోదు చేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నాడు. ఒకటి వర్షం కారణంగా రద్దయింది. ఈ విషయంలో మేం జట్టుగా గర్వపడుతున్నాం’ అని కోహ్లీ పేర్కొన్నాడు.
ఈ సీజన్ లో ఆర్సబీ అభిమానులను అలరించలేకపోయామని కోహ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.రుసగా ఆరు మ్యాచ్ లలో ఓడిపోయిన తరువాత కోలుకోవడం చాలా కష్టమని, కానీ, తాము ప్లే ఆఫ్ కు దగ్గరగా వచ్చామని అన్నాడు. ఓటములు ఎదురవుతున్నా, తమ జట్టు యాజమాన్యం వెన్నంటి నిలిచిందని చెప్పుకొచ్చాడు.