ప్రపంచంలోనే అత్యధిక ఖరీదు ఆటగా పేరుగాంచిన ఐపీఎల్ 12వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. భారతదేశ అభిమానులతో పాటు యావత్తు క్రికెట్ అభిమానులు మొత్తం ఐపీఎల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చిదంబరం స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌తో ఐపీఎల్–12 ప్రారంభమవుతుంది. 12వ సీజన్‌లో కూడా 8 జట్లు పాల్గోంటున్నాయి. లీగ్ దశలో 56 మ్యాచ్‌లు, మూడు ప్లే ఆఫ్‌లు, ఫైనల్ కలిపి మొత్తం 60 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.
మే 12న చెన్నైలోనే తుది పోరు జరుగుతుంది. ప్రతి ఏడాది ఐపీఎల్ ప్రారంభవేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ వేడుకలు రద్దును చేసింది బీసీసీఐ. పుల్వామా ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో ప్రారంభ వేడుకలను రద్దు చేశారు. ఈ రోజు(శనివారం) సాయంత్రం 8 గంటలకు 12వ సీజన్ మొదటి మ్యాచ్ జరగునుంది. అటు ధోని, ఇటు కోహ్లీలు తమ టీమ్‌లకు కెప్టెన్ల్‌గా వ్యవహారించడంతో పోటీ ధోని వర్సెస్ కోహ్లీగా మారింది. మరి మొదటి మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధించి టోర్నీ శుభారంభం చేస్తుందో చూడాలి.
- Advertisement -
క్రికెట్ (ఐపీఎల్) జాతర ఈ రోజు నుంచే..!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -