ఐపీఎల్ 2025 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుంది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోవడంతో అధికారికంగా చెన్నై ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. చెన్నై విధించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది. శ్రేయస్ అయ్యర్ 41 బంతుల్లో 72 పరుగులు , ప్రభ్ సిమ్రాన్ సింగ్ 36 బంతుల్లో 54 పరుగులు పరుగులు చేసి పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. చెన్నై బ్యాటర్లలో సామ్ కర్రాన్ (47 బంతుల్లో 88 పరుగులు) హాఫ్ సెంచరీ చేయగా డెవాల్డ్ బ్రెవిస్ (32) రాణించాడు. పంజాబ్ బౌలర్లలో చాహల్ నాలుగు వికెట్లు తీయగా అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
చెన్నైపై విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో చెన్నై ప్లే ఆఫ్స్ రేసు నుండి తప్పుకుంది.