ఐపీఎల్ 2025లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. 153 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ 16.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శుభ్ మన్ గిల్ 43 బంతుల్లో 61 పరుగులు చేయగా వాషింగ్టన్ సుందర్ 49 పరుగులు, రూథర్ ఫర్డ్ 35 పరుగులు చేశారు.దీంతో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. నితీశ్ రెడ్డి 31,క్లాసెన్ 27, అభిషేక్ శర్మ 18,కమిన్స్ 22 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు.
వరుసగా నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో లీస్ట్‌కి చేరింది హైదరాబాద్. ఇక గుజరాత్ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్ లో ఓటమి పాలైన గుజరాత్.. తర్వాతి మూడు మ్యాచుల్లోనూ విక్టరీ కొట్టింది. ఇక ఇవాళ ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది సన్‌రైజర్స్ హైదరాబాద్.