Friday, May 2, 2025
- Advertisement -

IPL 2025:హైదరాబాద్‌కు తొలి ఓటమి

- Advertisement -

ఐపీఎల్ 2025లో భాగంగా హోంగ్రౌండ్స్‌లో ఓటమి పాలైంది సన్ రైజర్స్ హైదరాబాద్. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 191 పరుగుల భారీ టార్గెట్‌ను కేవలం 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది లక్నో.

191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు ప్రారంభం నుంచే దూకుడుగా ఆడింది. నికోలస్ పూరన్‌ 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 70 పరుగులు చేయగా మిచెల్‌ మార్ష్‌ 31 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో (52) పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. చివరలో అబ్దుల్ సమద్ 8 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు చేశాడు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో 47 పరుగులు చేయగా, నితీశ్‌ రెడ్డి (32), క్లాసెన్‌ (26), అనికేత్ వర్మ 13 బంతుల్లో 36 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ (4/34)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -