ఐపీఎల్ 2025లో భాగంగా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ సూపర్ ఓవర్‌లో విక్టరీ సాధించింది. ఢిల్లీ విధించిన 189 పరుగల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్థాన్… నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగియగా సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్‌లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 11 పరుగులే చేసింది. 12 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ నాలుగో బంతికే ఛేదించింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ (49), రాహుల్ (38), స్టబ్స్ (34 నాటౌట్), అక్షర్ పటేల్ (34) పరుగులు చేశారు.
అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులే చేసింది. నితీశ్ రాణా (51),యశస్వి జైస్వాల్ (51) పరుగులు చేయగా చివరి ఓవర్‌లో స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చివరి సారిగా 2021లో ఐపీఎల్‌లో సూపర్ ఓవర్ జరిగింది. సన్ రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీనే గెలవడం విశేషం.