టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్ట్ టీ20 ప్రపంచకప్ తర్వాత ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించగా సోమవారంతో గడువు ముగిసింది. మొత్తం మూడు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లుగా తెలుస్తోండగా ఇందులో చాలా వరకు ఫేక్ అప్లికేషన్లు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మంత్రి నరేంద్రమోడీ, అమిత్ షా, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ప్రముఖుల పేర్లతో దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. అర్హులైన వారు ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
2022లో బీసీసీఐ ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తులను ఆహ్వానించినప్పుడు కూడా ఇలాగే జరిగింది. అప్పుడు 5వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.కొత్తగా టీమ్ఇండియా హెడ్ కోచ్ పదవి చేపట్టే వ్యక్తి వన్డే ప్రపంచకప్ 2027 ముగిసే వరకు ఆ పదవిలో కొనసాగనున్నాడు.