ఐపీఎల్ 17వ సీజన్‌లో పేలవ ఆటతీరుతో విమర్శల పాలైంది ముంబై ఇండియన్స్. ముఖ్యంగా ఈ సీజన్‌ని ఓటమితోనే ప్రారంభించి ఓటమితోనే ముగించింది. చివరి మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగగా 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది ముంబై.
లక్నో విధించిన 215 పరుగల లక్ష్య ఛేదనలో 6 వికెట్లు కొల్పోయి 196 పరుగులు చేసింది ముంబై. దీంతో 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఓపెనర్ రోహిత్ శర్మ
38 బంతుల్లో 68 పరుగులు చేయగా మిడిలార్డర్ లో ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా రాణించలేదు. చివర్లో నమన్ ధీర్ 28 బంతుల్లో 62 పరుగులు చేసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ముంబైకి ఓటమి తప్పలేదు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 41 బంతుల్లో 3 సిక్స్‌లు,3 ఫోర్లతో 55 పరుగులు చేయగా నికోలస్ పూరన్ సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 29 బంతుల్లో 8 సిక్స్‌లు,5 ఫోర్లతో 75 పరుగులు చేశాడు. దీంతో లక్నో భారీ స్కోరు సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నికోలస్ పూరన్ కు దక్కింది.