ఇండియా మహిళల జట్టు గత కొద్ది రోజులుగా తీవ్ర సంక్షోభంలో ఉంది. కోచ్ పొవార్‌పై మిథాలీ ఆవేదన వ్యక్తం చేయగా, మరోవైపు టి20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్, స్మృతి మంధానలు కోచ్‌కు మద్దతివ్వడంతో జట్టు వర్గాలుగా విడిపోయిందనే విమర్శలొచ్చాయి. కొత్త కోచ్ నియామకంతో కోచ్ రమేశ్ పొవార్‌తో వివాదం ముగిసిపోయిందని తెలుస్తుంది. మహిళల సెలక్షన్ కమిటీ కివీస్ పర్యటన కోసం ఎంపిక చేసిన వన్డే, టి20 జట్లలో మిథాలీకి సముచిత గౌరవం ఇచ్చిన సంగతి తెలిసిందే.
మిథాలీపై నమ్మకముంచిన సెలక్టర్లు టి20 జట్టులోనూ ఆమెను కొనసాగించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పలు విషయాలను పంచుకుంది మిథాలీ.గతాన్ని మరిచి మళ్లీ క్రికెట్ మీదే దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని భారత మహిళల వన్డే సారథి మిథాలీరాజ్ తెలిపింది.. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు శనివారం ఇక్కడికొచ్చిన ఆమె మీడియాతో ముచ్చటించింది. ‘ ఈ వివాదం చేదు అనుభవాన్నిచ్చింది. ఇది మా అందరినీ బాగా ఇబ్బందిపెట్టింది. ఇప్పుడైతే అంతా కుదుటపడింది. ఇక పూర్తిగా ఆటపై, జట్టుపై దృష్టిపెడతా’ అని మిథాలీ చెప్పింది.
- Advertisement -
కెప్టెన్‌గా మళ్లీ మిథాలీనే
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -