Wednesday, April 24, 2024
- Advertisement -

నా ఫెవ‌రేట్ క్రికెట‌ర్ స‌చినే.. బ‌యోపిక్ చేయాలంటే భ‌యం…జూనియ‌ర్ ఎన్టీఆర్‌

- Advertisement -

తండ్రులు ఆస్తులు పంచినట్లు క్రికెట్‌పై ప్రేమను పంచారని టాలీవుడ్‌ స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ సీజన్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌లకు తెలుగు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ఎన్టీఆర్‌ మంగళవారం పార్క్‌హయత్‌ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొని స్టార్‌ మా రూపోందించిన ప్రచార వీడియోను విడుదల చేశారు.

మీ అభిమాన క్రికెటర్ ఎవరు అన్న ప్రశ్నకు.. ‘చిన్నప్పుడు స్కూలుకెళ్లే సమయంలో నా ఫేవరెట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్. ఇప్పుడు ధోనీ కూడా. కానీ అప్పటికీ ఎప్పటికీ సచిన్.. సచిన్.. సచిన్. ఆయనే నా అభిమాన క్రికెటర్’ అని ఎన్టీఆర్ జవాబు చెప్పారు. క్రికెట్ ఆడటమన్నా, చూడటమన్నా తనకు చాలా ఇష్టమని తెలిపారు. క్రికెట్ స్ఫూర్తిని నింపే ఆటని అలాంటి ఆటకు ప్రచారం కల్పించే అవకాశం రావడం నిజంగా అదృష్టమన్నారు.

ఒక క్రికెటర్ బయోపిక్ చేయాల్సి వస్తే ఎవరిది చేస్తారు? అని అడిగిన ప్రశ్నకు.. ‘నాకు బయోపిక్ చేయడానికి కొంచెం భయం ఉంది. నేను కేవలం ఒక నటుడిని. ఒక ఫిల్మ్ హీరోని. నేషనల్ హీరో పాత్ర పోషించడమంటే మాటలు కాదు. అంత ధైర్యం నాకు లేదు’ అని ఎన్టీఆర్ బదులిచ్చారు. భవిష్యత్తులో తనకు ఏ ప్రాంచైజీని కొనే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -