Saturday, May 3, 2025
- Advertisement -

అశ్విన్ కూడా…సీనియర్ల బాటలోనే!

- Advertisement -

టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే చివరిదని తెలిసిందే. అనిల్ కుంబ్లే,,సౌరవ్ గంగూలీ , రాహుల్ ద్రవిడ్,వీవీఎస్ లక్ష్మణ్‌,వీరేంద్ర సెహ్వాగ్ ,ధోని ఇలా సీనియర్ ఆటగాళ్లు అందరికి బోర్డర్- గావస్కర్‌ ట్రోఫీనే చివరిదని తెలిసిందే. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీతోనే వీరంతా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు ఇదే బాటలో పయనించారు రవిచంద్రన్ అశ్విన్.

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు అశ్విన్. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సమక్షంలో మ్యాచ్ అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటించాడు.

2011లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌ సందర్భంగా తొలి టెస్టు ఆడారు అశ్విన్. తర్వాత క్రమంగా వన్డే, టీ20 టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత ఆ ప్లేస్‌ను భర్తీ చేసిన అశ్విన్.. క్రమంగా స్టార్‌గా ఎదిగాడు. 106 టెస్టులు ఆడిన అశ్విన్.. 537 వికెట్లు తీశాడు. బ్యాట్‌తోనూ దుమ్ములేపాడు. 3,503 పరుగులు చేశాడు. ఇందలో 6 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో 114 వికెట్లు, టీ20ల్లో 65 వికెట్లు పడగొట్టాడు అశ్విన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -