Sunday, May 4, 2025
- Advertisement -

వన్యప్రాణ సంరక్షణ చట్టానికి వ్యతిరేకంగా చర్యలు

- Advertisement -

రవీంద్ర జడేజా. భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్. ఎన్నోసార్లు భారత్ ను గెలుపు తీరానికి తీసుకువెళ్లిన క్రికెటర్. తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహసమే. అయినా భారత చట్టాల ప్రకారం ఇది పెద్ద నేరం. ఇంతకీ జడేజా చేసిందేమిటనుకుంటున్నారా. గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాలోని సాసన్ గిర్ కు రెండు రోజుల పాటు విహార యాత్రకు వెళ్లాడు జడేజా.

అతని వెంట భార్య, ఆమె స్నేహితులు కూడా ఉన్నారు. సాసన్ గిర్ లో సింహాలు అలా స్వేచ్ఛగా తిరుగుతూనే ఉంటాయి. వాటిని జీపులోంచి చూస్తూ ఎంజాయ్ చేసేవాళ్లే ఉంటారు. అయితే జడేజా మాత్రం తన భార్య, స్నేహితులతో కలిసి హఠత్తుగా జీపు దిగి సింహాల ముందు నుంచి ఫొటోలకు ఫోజులిచ్చాడు. సింహాలకు 10 నుంచి 13 మీటర్ల దూరంలో నుంచి అతను ఫొటోలు దిగాడు.

జడేజా, అతని భార్య సింహాల ముందు కూర్చుని తీయించుకున్న ఫొటోలను సామాజిక మాద్యమాల్లో పెట్టారు. దీంతో ఇది వివాదం అయ్యింది. భారత వన్యప్రాణ రక్షణ చట్టం ప్రకారం సింహాల ముందు కూర్చుని ఫొటోలు తీయించుకోకూడదు. దీంతో గుజరాత్ ప్రభుత్వం దీనికి విచారణకు ఆదేశించింది. జడేజాతో పాటు ఫారెస్టు సిబ్బంది కూడా సింహాల ముందు నుంచుని ఫొటోలు తీయించుకోవడం కూడా వివాదమైంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -