Sunday, May 4, 2025
- Advertisement -

రోహిత్..రికార్డులు బ్రేక్!

- Advertisement -

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 8లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రికార్డులు బ్రేక్ చేశాడు టీమిండియా సారధి రోహిత్ శర్మ. 41 బంతుల్లో 92 పరుగులు చేసిన రోహిత్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 8 సిక్స‌ర్లు, ఏడు ఫోర్లతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

సెంచరీ మిస్ అయిన ఈ మ్యాచ్లో పలు రికార్డులు నెలకొల్పాడు రోహిత్. టీ20 క్రికెట్‌లో 200 సిక్స‌ర్లు కొట్టిన తొలి ప్లేయ‌ర్‌గా అరుదైన ఫీట్ సాధించాడు. అలాగే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఓ ప్ర‌త్య‌ర్థి దేశంపై అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. రోహిత్ టీ20ల్లో 4165 పరుగులు చేయగా తర్వాతి స్థానంలో బాబ‌ర్ ఆజ‌మ్ 4145, విరాట్ కోహ్లీ 4103 ర‌న్స్ చేశారు.

ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుపై అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆటగాళ్లలో రోహిత్ తొలిస్ధానంలో ఉన్నారు. ఆసీస్‌పై 132 సిక్సర్లను రోహిత్ బాధగా తర్వాత స్థానంలో క్రిస్ గేల్ ఉన్నారు. ఇంగ్లాండ్‌పై గేల్ 130 సిక్సర్లు కొట్టగా వెస్టిండీస్‌పై రోహిత్ 88 సిక్సర్లు బాధాడు. ఇక రోహిత్ దరిదాపుల్లో ఏ ఆటగాడు లేకపోవడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -