ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన 8 మ్యాచ్‌ల్లో 2 విజయలు మాత్రమే నమోదు చేసింది చెన్నై. ఈ క్రమంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ పదవి నుండి తప్పుకోగా మహేంద్రసింగ్ ధోని తిరిగి సీఎస్‌కే పగ్గాలే చేపట్టారు.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయపడ్డాడని అందుకే ఈ సీజన్ నుండి తప్పుకున్నట్లు ప్రకటించింది సీఎస్‌కే యాజమాన్యం. అయితే మ్యాచ్ అనంతరం రుతురాజ్ గైక్వాడ్స్, కోచింగ్ స్టాఫ్‌తో కలిసి ఫుట్‌బాల్ ఆడుతున్న వీడియో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది జరిగిన వెంటనే గైక్వాడ్.. సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు.
2025 సీజన్‌లో అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతున్నాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఈ సీజన్‌తో ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ ఇస్తాడని ప్రచారం జరుగుతోంది.గతంలో జడేజా కూడా సీఎస్‌కే కెప్టెన్‌గా ఉండగా వరుస ఓటములతో కెప్టెన్‌గా జడేజాను తొలగించింది సీఎస్‌కే యాజమాన్యం. దీంతో అప్పుడు ధోనిని అన్‌ఫాలో చేశారు జడేజా. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో అందరిలో చర్చనీయాంశంగా మారింది.