టీ20 ప్రపంచకప్‌ని రెండోసారి గెలిచింది టీమిండియా. 17 ఏండ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది రోహిత్ సేన. చివరి ఓవర్ వరకూ నరాలుతెగే ఉత్కంఠతో హోరాహోరీగా సాగిన ఫైనల్‌లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది టీమిండియా. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులు మాత్రమే చేసింది. దీంతో గత 33 ఏండ్లుగా క్రికెట్ వరల్డ్ కప్ దక్షిణాఫ్రికాకు అందని ద్రాక్షగానే మిగిలిపోయింది.
క్లాసెన్ 27 బంతుల్లో బంతుల్లో 5 సిక్స్‌లు,2 ఫోర్లతో 52 పరుగులు చేయగా డికాక్(39) రాణించారు. హార్దిక్‌పాండ్యా(3/20) మూడు వికెట్లతో విజృంభించగా, అర్ష్‌దీప్‌సింగ్(2/20), బుమ్రా(2/18) రెండేసి వికెట్లతో సత్తాచాటారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 2 సిక్స్‌లు,6 ఫోర్లతో 76 పరుగులు చేయగా అక్షర్‌పటేల్ 31 బంతుల్లో 4 సిక్స్‌లతో 47 పరుగులు చేశాడు. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
టీ20 కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది 50వ విజయంకాగా టీమిండియాకు రూ.20.40 కోట్లు, రన్నరప్ దక్షిణాఫ్రికా రూ.10.67 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది.