టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది టీమిండియా. న్యూయార్క్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత్ విధించిన 120 పరుగుల లక్ష్య చేదనలో చేతులెత్తేసింది టీమిండియా. ఓ దశలో పాక్ గెలుపు ఖాయమనుకున్న తరుణంలో బుమ్రా అద్భుత బౌలింగ్‌తో టీమిండియా ఓటమి నుండి బయటపడింది. నాలుగు ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు బుమ్రా. పాక్ ఆటగాళ్లలో రిజ్వాన్ 31 పరుగులు చేయగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలం అయ్యారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ 31 బంతుల్లో 42 పరుగులు చేసి రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. దాయాది పాక్‌ను రోహిత్ సేన మట్టికరిపించడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.