Sunday, May 4, 2025
- Advertisement -

రాంచీ టెస్టు..విజయానికి చేరువలో

- Advertisement -

రాంచీ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో విజయానికి అడుగు దూరంలో నిలిచింది టీమిండియా. 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రోహిత్ సేన దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. మూడో రోజు ఆటముగిసే ముగిసే సమయానికి 40 పరుగులు చేయగా విజయానికి 152 పరుగులు చేయాల్సి ఉంది.
య‌శ‌స్వి జైస్వాల్ (16), రోహిత్ శ‌ర్మ (24) క్రీజులో ఉన్నారు.

ఇక ఈ టెస్టు ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో 4000 ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. టీమిండియా క్రికెట‌ర్ల‌లో ఈ మైలురాయిని దాటిన 17వ ఆటగాడిగా నిలిచాడు.

2013లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రోహిత్ ఇప్పటివరకు 58 మ్యాచ్‌లు ఆడగా 4004 ప‌రుగులు చేశాడు. ఇందులో 11 సెంచ‌రీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేయగా టీమిండియా 307 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్ల ధాటికి 145 పరుగులకే ఆలౌట్ అయింది. స్పిన్నర్ అశ్విన్ 5, కుల్దీప్ 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -