Saturday, May 3, 2025
- Advertisement -

ఎమర్జింగ్‌ ఆసియా కప్‌కు భారత జట్టు

- Advertisement -

ఒమన్‌ దేశంలో జరగనున్న ఎమర్జింగ్ ఆసియా కప్‌కు భారత్‌-ఎ జట్టును ప్రకటించింది బీసీసీఐ. 15 మందితో కూడిన జట్టును ప్రకటించగా ఈ టీమ్‌కు తిలక్ వర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ నెల 18 నుంచి టోర్ని ప్రారంభం కానుంది.

మొత్తం 8 జట్లు పోటీపడనుండగా గ్రూప్-ఏలో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్-బీలో భారత్, ఒమన్, పాకిస్థాన్, యూఏఈ జట్లు ఉన్నాయి. గ్రూప్‌లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరనుండగా అక్టోబర్ 25న సెమీస్, అక్టోబర్ 27న ఫైనల్ జరగనుంది.

భారత్-ఎ జట్టు ఇదే…

తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, నిశాంత్ సింధు, అనుజ్ రావత్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, నేహాల్ వదేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షోకీన్, ఆకిబ్ ఖాన్, వైభవ్ అరోరా, రసీక్ సలామ్, సాయి కిశోర్, రాహుల్ చాహర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -