Monday, May 5, 2025
- Advertisement -

తన భార్య‌ను చూసి భ‌య‌ప‌డుతున్న స్టార్ క్రికెట‌ర్‌ విరాట్ కోహ్లీ..

- Advertisement -

తన భార్య అనుష్కా శర్మను చూసి భయపడ్డానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. గత రాత్రి తాను ఆమె నటించిన ‘పారీ’ చిత్రాన్ని చూశానని, తన భార్య మిగతా చిత్రాలతో పోలిస్తే అద్భుత నటనను ఇందులో చూపిందని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు.

చాలాకాలంగా ఇంత మంచి చిత్రాన్ని తాను చూడలేదని చెప్పాడు. సినిమా చూసి తాను కొంత భయపడ్డానని, ఇదే సమయంలో ఆమె నటనకు ముగ్ధుడినై గర్వపడుతున్నానని వ్యాఖ్యానించాడు. కాగా, అనుష్కా శర్మ నటించిన హారర్ చిత్రం ‘పారీ’ నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -