ఫిబ్రవరి 19 నుండి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈసారి ఈ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్య మివ్వనుండగా తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది పాకిస్థాన్. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోహ్సిన్ నక్వీ కీలక ప్రకటన చేశారు.
పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని అన్నారు. ఎనిమిది జట్ల గ్లోబల్ టోర్నమెంట్‌కు సంబంధించిన భద్రతా ప్రణాళికలు, ప్రోటోకాల్‌లను అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆమోదించిందని వెల్లడించారు. 1996 తర్వాత తొలిసారిగా దేశంలో ఐసీసీ టోర్నమెంట్ జరుగుతోందని.. ఈ నేపథ్యంలో అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
అంతర్జాతీయ క్రికెట్‌ను మళ్లీ పాకిస్తాన్‌కు తీసుకురావడంలో పీఎస్‌ఎల్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ ఈవెంట్‌ను సక్సెస్ ఫుల్‌గా నిర్వహించి పాకిస్థాన్‌లో మరిన్ని అంతర్జాతీయ టోర్నమెంట్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
2019 నుండి అన్ని ప్రధాన టెస్ట్ ఆడే జట్లు భారత్ మినహా – పాకిస్తాన్‌ను సందర్శించాయి. అలాగే విదేశీ ఆటగాళ్లు నిత్యం PSLలో పాల్గొంటున్నారు. ఇదే పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్ ఆడేందుకు సభాయమైందని నఖ్వీ తెలిపారు.