ఐపీఎల్ తర్వాత భారత జట్టు వరల్డ్‌కప్ కు సిద్దమవుతోంది. ఇప్పటికే బీసీసీఐ జట్టు కూర్పుపై ఇప్పటికే ఓ అంచనా వచ్చింది. తాజాగా జట్టు ఎంపికపై రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఐపీఎల్ ఆధారంగా వరల్డ్ కప్ జట్టు ఎంపిక ఉండదని తేల్చి చెప్పారు. గతంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలను రోహిత్ సమర్ధించారు. ఐపీఎల్‌లో ప్రదర్శన అనేది వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయబోయే జట్టుకు ఎంతమాత్రం ప్రామాణికం కాదని తేల్చిచెప్పాడు. వరల్డ్‌కప్‌కు జట్టును ఎంపిక చేసే క్రమంలో గత కొంత కాలంగా భారత ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉందనే దానిపైనే ఎంపిక ఉంటుందన్నారు.ఐపీఎల్ అనేది మెగాటోర్నీకి ఎంపికకు కొలమానం కాదన్నారు. గత నాలుగేళ్లలో భారత జట్టు సాధ్యమైనన్ని వన్డేలు, టీ20లు ఆడిందని ఆ అనుభవం సరిపోతుందన్నారు. ఐపీఎల్ అనేది బంతికి బ్యాట్‌కు జరిగే ఒక ప్రత్యేకమైన గేమ్. ఇదొక ఫ్రాంఛైజీ క్రికెట్ అనేది వాస్తవం. ఐపీఎల్ ఫామ్ ఆధారంగా వరల్డ్‌కప్‌కు వెళ్లబోయే జట్టును ఎంపిక చేసే పరిస్థితి ఉండదు’ అని రోహిత్ పేర్కొన్నాడు.
- Advertisement -
వరల్డ్‌కప్ జట్టు ఎంపికపై షాకింగ్ వ్యాఖ్యలు చేసిన రోహిత్ శర్మ…
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -