వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు రైడ్ చేసి వారిమీద క్రిమినల్ కేసలు పెట్టడం పరిపాటి. అయితే ఇప్పటినుంచి పోలీసులకు అపప్పులు ఉడకవు. వ్యభిచారం చేసె సెక్స్ వర్కర్ల పై క్రిమినల్ కేసులు పెట్టకూడదని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
సెక్స్ వర్కర్లు తమ ఇష్టపూర్వకంగా పడుపువృత్తిని నిర్వహిస్తే – అందుకు ఏ ప్రేరేపిత శక్తి బలత్కారం కారణం కాకుంటే వారి వ్యభిచారాన్ని నేరంగా పరిగణించలేం అని గుజరాత్ హైకోర్టు తెలిపింది.ఐపీసీ సెక్షన్ 370 నిబంధన బానిసత్వం-భౌతిక-లైంగికదాడిని సూచిస్తుందని అర్థంచేసుకోవాలని కోర్టు పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 3న సూరతలోని ఒక వ్యభిచార గృహంపై పోలీసులు చేసిన దాడిలో వినోద్‌పటేల్ అనే వ్యక్తిపైనా, అతడితోపాటు దొరికినవారిపైనా పోలీసులు ఐపీసీ సెక్షన్ 370 కింద, ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వినోద్ పటేల్ దీన్ని హైకోర్టులో సవాల్ చేశాడు.పోలీసులు అరెస్టు చేసే సమయానికి తాను సెక్స్‌వర్కర్‌తో లేనని.. తన వంతు కోసం ఎదురుచూస్తున్నానని, కాబట్టి తనపై ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) యాక్ట్ కింద కేసు పెట్టడం చెల్లదని, ఆ కేసు కొట్టివేయాలని పిటిషన్‌లో కోరాడు. అతడి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జేబీ పర్దీవాలా.. వినోద్‌పటేల్‌పై ఆ చట్టం కింద మోపిన అభియోగాలను కొట్టివేశారు.
ఈసందర్భంగా కోర్టు ఒక మహిళ ఇష్టపడి సెక్స్ వర్కర్‌గా మారితే, ఆమె వద్దకు వెళ్లే వినియోగదారులపై ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ కింద కేసు పెట్టకూడదని స్పష్టం చేశారు. అదే సమయంలో.. ఐపీసీ సెక్షన్ 370 కింద పెట్టిన కేసులో మాత్రం వినోద్ పటేల్‌పై దర్యాప్తు కొనసాగించాలని తేల్చిచెప్పారు. పోలీసులు అరెస్టు చేసే సమయానికే అతడు డబ్బు చెల్లించి ఉంటే వినియోగదారుడి కిందకే వస్తాడని.. అప్పుడు అతడిపై ఆ సెక్షన్ కింద కేసు దర్యాప్తు చేయవచ్చని వివరించారు.
{loadmodule mod_sp_social,Follow Us}