చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదని జగన్ అనడంతో చంద్రబాబుకు తలకోట్టేసినంత పనైంది. దాంతో చంద్రబాబు ఆ విషయంపై స్పందించి ”నాకు ఇంగ్లీష్ రాదంటావా.. నేను ఎస్వీ యూనివర్సిటీలో పీజీ చదివాను” అంటూ జగన్ ఉద్దేశించి మండిపడ్డారు.ఇంగ్లీష్ రాదంటూ తనపై జగన్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన సమాధానమిచ్చారు.
తనకు ఇంగ్లీష్ రాదని ఇంతవరకూ ఎవరూ అనలేదని.. దేశవిదేశాల్లో తిరిగొచ్చినవాడినని.. ఎస్వీ యూనివర్సిటీలో పీజీ చదివానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే… ఎస్వీ యూనివర్సిటీలో పీజీ చేసినంత మాత్రాన ఇంగ్లీష్ వస్తుందన్న గ్యారంటీ ఏమిటో మాత్రం ఆయన చెప్పలేదు.
అయితే… చంద్రబాబు గురించి బాగా తెలిసినవారు మాత్రం జగన్ ఆ మాట అనకపోవాల్సింది అంటున్నారు. అందుకు కారణమూ చెబుతున్నారు వారు. తనకూ ఇంగ్లీష్ వచ్చని నిరూపించుకోవడానికి చంద్రబాబు ఇకపై తెలుగు మాట్లాడడం మానేసి ఇంగ్లీష్ లోనే మాట్లాడితే కష్టమని.. ఆయన తెలుగులో మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నామని.. ఇంగ్లీష్ లో మాట్లాడితే విలేకరులు ఏమైపోవాలని అంటున్నారు.