ఇద్దరు ముగ్గురుకి ఒకే పేరు ఉంటె రకరకాల భావాలూ, భావనలూ, కంగారూ ఒస్తూ ఉంటుంది. కేవలం ఒక హెడ్ లైన్ ఒక గందరగోళం సృష్టిస్తోంది తెలుగు రాష్ట్రాల్లో. బాలకృష్ణ ని కిడ్నాప్ చేయించిన చంద్రబాబు అనే న్యూస్ ఇప్పుడు ఎక్కడ చూసినా సంచలనంగా మారింది.
ముఖ్యమంత్రి పదవి లో ఉన్న ఒక వ్యక్తి తన సొంత బావ మరిదీ అందునా తన పార్టీ ఎమ్మెల్యే ని ఎలా కిడ్నాప్ చేయిస్తారు అనేది ఇక్కడ జనాలు ఆలోచిస్తున్న మాట. అయితే ఈ కన్ఫ్యూజన్ అంతా ఒక హెడ్ లైన్ తో వచ్చి పడింది.
అసలు మ్యాటర్ ఏంటంటే హైదరాబాద్ ఈసీఎల్ లోని ముప్పై కోట్ల విలువైన స్థలం కబ్జా చెయ్యడం కోసం ఆ స్థలం యజమాని బాలకృష్ణ అనే వ్యక్తి ని దుండగులు కిడ్నాప్ చేయించారు. కేసులో కబ్జా దారులకి నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు సహాయం చేసారు అని తేలింది దీంతో ఎక్కడ చూసినా వీరిద్దరి పేర్ల మీదా న్యూస్ స్ప్రెడ్ అయిపోతోంది. బాధితుడి పేరు బాలకృష్ణ కావడం నిందితుల పేర్లలో చంద్రబాబు పేరిట ఒకరు ఉండడంతో ఆ రెండు పేర్లే హెడ్లైన్స్లో హైలైట్ అయి కూర్చున్నాయి.